జిజ్ఞాస
విశ్వ
స్వరూపం గురించి ఎంతో కొంత తెలుసుకున్నాక, మన ఆత్మవిశ్వాసం పెరుగుతుందా ? “మనం
ఎంత” అన్న నిరాశ మిగులుతుందా ? ఇప్పటి వరకు మనకు తెలిసిన బుద్ధిజీవులం
మనమే ! కనుక
విశ్వ రహస్యాలను ఛేదించాల్సిందీ మనమే! వైజ్ఞానికమే ఊతగా ముందుకు సాగడమా ! ఆ
విధంగా విశ్వంలోని దూరా భారాలు, సంక్లిష్టతలూ అధిగమించడానికి ఎంత కాలం పడుతుంది ?
అప్పటికి భూమి నాశనం కాకుండా ఉంటుందా ? మానవ జాతి అంతవరకు మనుగడ సాగిస్తుందా ? మనకు
సాయంగా అంతరిక్షాన కొత్త ఆవాసాలను, కొత్త జీవులను వెతుక్కోగలుగుతామా ? సృష్టికి
ఆది ఉన్నప్పుడు, అంతమూ తప్పనిసరి. అటువంటప్పుడు సృష్టిని మించినది ఏది ?
సృష్టికి ఆరంభం ఉన్నవన్నీ, మనతో సహా అన్నిటా
ఉన్నాయని సైన్సు చెబుతోంది. ఒకవేళ సృష్టికి మించినది ఏదైనా ఉన్నా అదీ మనలోనూ
ఉంటుందా ?
“ఫలితం గురించి ఆలోచించకుండా నీ పని నీవు చేయి“ అన్న
గీతోపదేశాన్ని ఫాలో అయిపోవడమా? అలాగయితే మన పని ఏదో ఎవరు నిర్ణయించాలి ? అసలు
ఈ అన్వేషణకు మానవాళిని సర్వసన్నద్ధం చేసే వికాసాన్ని, సఖ్యతను అలవర్చుకోవాలంటే ఎలా
? మనిషి కనీస అవసారాలను తీరడమే గగనమైనప్పుడు వేరే అన్వేషణలు సాధ్యం
కావు. ఆయుష్షు పెరిగేటట్లు, ఆకలి దప్పులు తీరేటట్లు, అవి లేకుండా చేసేటట్లు
వైజ్ఞానిక రంగం అభివృద్ది చెందుతుందా ? ఆ ఫలాల పంపిణి సరిగా సాగేటటువంటి సఖ్యత
త్వరత్వరగా అభివృద్ది చెందుతుందా ? కోర్కెలే దుఃఖ కారణం, వాటిని త్యజించు అన్న
బుద్ధుని బోధన మనిషి వికాసానికి మార్గమా ? మతం, ఆధ్యాత్మికత మనిషుల్లో సఖ్యతను,
సహనాన్ని, వికాసాన్ని తేగలవా ? మనిషిలో వీటివల్ల వ్యక్తిగతంగా మరింత మంచి
మార్పు వస్తుందా ? లేదా వాటిని అలవరచడానికి రాజకీయ, ఆర్ధిక వ్యవస్థలను
రూపొందించాలా ? మనమెవరమో తెలుసుకోడానికి ముందు మనం ఎలా
మెలగాలో తెలుసుకోనక్కరలేదా ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి