17, సెప్టెంబర్ 2017, ఆదివారం

North Korea brief history


1945 వరకు కొరియా ద్వీపకల్పం జపాన్ ఏలుబడిలో ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయాక, అమెరికా, రష్య ఈ ద్వీపకల్పాన్ని రెండు దేశాలుగా చేశాయి. సరిహద్దులూ, సైన్యం కాపలా, మందుపాతర్లు ఈ దేశాలను విడదీసినా, రెండింటి ప్రజల భాషా ఒకటే, తాతలు ఒకరే. అమెరికా ప్రభావంలో దక్షిణకొరియా కొరియా రిపబ్లిక్ ఏర్పడింది. రష్యా ప్రభావంతో ఉత్తరకొరియా డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాగా కమ్యూనిస్టు దేశం అయింది. ప్రపంచ యుద్ధంలో కొరియా హీరో అయిన కిమ్ II సుంగ్ (KIM II Sung) ఉత్తరకొరియా ప్రధానమంత్రి అయ్యాడు. అయిదేళ్లు తిరగకుండా 1950లో కమ్యూనిస్టు రష్యా, చైనా అండదండలతో ఉత్తర కొరియా సైన్యం దక్షిణ కొరియాపై దాడి చేసింది. కొద్ది నెలల్లోనే దాదాపు దక్షిణ కొరియా అంతటినీ ఆక్రమించింది. అప్పుడు అమెరికా నాయకత్వంలో ఐక్యరాజ్య సమితి సంకీర్ణ సేనలు దక్షిణ కొరియాకు మద్దతుగా ఉత్తర కొరియాపై యుద్ధానిక దిగాయు. దాదాపు మూడేళ్లపాటు సాగిన యుద్ధంలో దాదాపు 10 లక్షల మంది ప్రాణాలు కొల్పోయారు. ప్రజలు, రెండు కరియాల సైనికులతో పాటు, అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా సైనికులు చాలా మంది చనిపోయారు. చివరికి 1953లో యుద్ధం ముగిసింది. నష్టమే భారీగా కనిపించింది తప్ప సరిహద్దులు పాతవే ఉన్నాయి. రెండు దేశాలమధ్య నిస్సైనిక ప్రాంతం, దానికి అటూ ఇటూ భారీ కాపలా, మందు పాతర్లతో దశాబ్దాలుగా రెండు దేశాలు శత్రువులుగా మిగిలాయి. కమ్యూనిస్టు దేశమైన ఉత్తరకొరియాకు 1991 లోరష్యా పతనం తర్వాత అండలేకుండా పోయింది. 1994లో కిమ్ సుంగ్ చనిపోయాడు. ఆయన తన కొడుకు కిమ్ జుంగ్‌ను తన వారసుడిగా దేశాధ్యక్షుడిగా ప్రకటించారు. 2011లో కిమ్ జొంగ్ (Kim Jong) చనిపోయాక, ఆయన కుమారుడు కిమ్ జొంగ్ ఉన్ ఉత్తరకొరియా అధ్యక్షుడయ్యాడు. వారసత్వ పాలనను కొనసాగిస్తున్న కిమ్ జొంగ్ ఉన్ అణ్వస్త్రాలు, వాటిని మోసుకెళ్లే క్షిపణులే అనేక దేశాల ఆంక్షల మధ్య సతమతమయ్యే తమ దేశానికి పరిష్కారమన్న తన తాత, తండ్రుల పద్ధతిని కొనసాగించాడు. ఇప్పుడు ఖండాంతర క్షిపణులను, హైడ్రోజన్ బాంబును తయారు చేసి అమెరికాను కాచుకోమంటున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి